MDK: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్‌కు దళిత సంఘాలు వినతిపత్రం ఇచ్చాయి. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బాధితులకు రావాల్సిన రూ. 59 లక్షల పరిహారం, అంబేద్కర్ భవన స్థల సమస్య ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. వీటిపై స్పందించిన మంత్రి, సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.