TG: నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథి, ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జిల్లా ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, రాకేష్ రెడ్డి, కలెక్టర్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.