కృష్ణా: జల సంరక్షణకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం ఘంటసాల మండలం తాడేపల్లిలో ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. గ్రామములో చెరువు పూడిక తీసిన ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడారు. గ్రామంలో చేపట్టిన పనుల వివరాలను సంబందిత సిబ్బంది ఆయనకు వివరించారు.