RR: ఇబ్రహీంపట్నంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి లబ్ధిదారులకు కొత్త ఇళ్లను అందించారు. పేదలకు ఆత్మగౌరవాన్ని అందించే ఈ పథకంలో, అర్హులైన వారందరికీ దశలవారీగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన భరోసానిచ్చారు. సొంతింటి కలను నెరవేర్చుకున్న లబ్ధిదారులు సంబరాల్లో మునిగిపోయారు.