ప్రకాశం: కొండేపి మండలంలో అన్ని పాఠశాలలకు సంబంధించి మధ్యాహ్నం భోజనం తయారు చేసే వంట వారికి, సహాయకులకు జడ్పీహెచ్ పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళవారం ఎంఈవో సురేఖ అధ్యక్షతన వారికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంఈవో మాట్లాడుతూ.. మెనూ ప్రకారం తప్పనిసరిగా భోజనం తయారు చేయాలని సూచించారు.