PLD: అమరావతిలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఇంటర్ రెండవ సంవత్సరం కెమిస్ట్రీ పరీక్షకు 108 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష సమయానికి 20 నిమిషాల ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకొని తమ గదులను పరిశీలించుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్ష గదుల్లో ఫ్యాన్లు, తాగునీటి సదుపాయాలను కల్పించారు.