TG: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో అక్రమ బెల్ట్ షాపులపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం బాబుల హంగామాతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న స్థానికుల ఫిర్యాదుతో.. ఆయన ఎక్సైజ్, పోలీస్ అధికారులతో కలిసి స్వయంగా దాడులు నిర్వహించి, కాలనీలో అక్రమ మద్యం విక్రయాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు