TG: తనకు అధికారంపై కాకుండా వ్యవస్థల్లో మార్పుపైనే ప్రేమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని నేతలు కోరినా, ఆంధ్రాలోనే అధికారం కోరుకోని తాను ఇక్కడెందుకు ఆశిస్తానని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ద్వేషం పెంచుకునే తత్వం ఉన్నవారు కాదని, అందుకే ఏపీ ప్రజలు ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నారని పవన్ స్పష్టం చేశారు.