BHPL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ కమలాపూర్ గ్రామానికి చెందిన జిలకర అశోక్ ముదిరాజ్‌ను పరామర్శించారు. ఇటీవల తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశోక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులతో మాట్లాడి తగిన సూచనలు చేశారు.