HNK: శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామంలో రేషన్ షాపును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సమయానికి, పారదర్శకంగా అందిస్తుందని, గ్రామ స్థాయిలో రేషన్ దుకాణాల ఏర్పాటు ద్వారా ప్రజలకు సులభంగా సరుకులు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.