ADB: ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యసంవత్సరం నుంచి ఉచితంగా ఏఐతో పాటు సైబర్ సెక్యూరిటీపై శిక్షణా అందించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ ఆన్నారు. మంగళవారం హైదరాబాద్కు చెందిన ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకొవాలని కోరారు.