BHNG: వలిగొండ మండల పరిధిలోని సంగెం గ్రామంలో ఇవాళ ఉపాధి హామీ కూలీలతో జరిగిన సమావేశంలో ఉపాధి పనులను అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. ఉపాధి పనుల వద్ద రెండుసార్లు ఫోటో తీసే విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.