JN: తెలంగాణ రాజ్యాధికార పార్టీ(TRP ) జిల్లా నూతన అధ్యక్షుడిగా కిలాషాపూర్ గ్రామానికి చెందిన కట్ల సదానందం నియమితులయ్యారు. పార్టీ అధినేత, MLC తీన్మార్ మల్లన్న నియమాక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మల్లన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.