KMM: TGSRTC వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి సోమవారం మధిర డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా మధిరలో నిర్మాణంలో ఉన్న నూతన బస్టాండ్ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం తాత్కాలిక బస్టాండ్, డిపో గ్యారేజీని సందర్శించి, నిర్వహణ విధానంపై సంబంధిత అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు.