MDK: గజ్వేల్లో కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ BRS యువజన విభాగం అధ్యక్షులు శ్రీకాంత్, విద్యార్థి విభాగం అధ్యక్షులు నాని వెంకట్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇది కేవలం ఒక దాడి కాదని ఇది ప్రజాస్వామ్యంపై, తెలంగాణ ఆత్మగౌరవంపై దాడేనని హెచ్చరించారు. అనంతరం దాడిని నిరసిస్తూ తూప్రాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.