NGKL: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆదివారం పూజ చేసి ప్రారంభించారు. పట్టణంలో విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తామన్నారు.