AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. IPS పీవీ సునీల్ కుమార్ అంటే తనకు కోపం లేదన్నారు. ‘గతంలో పీవీ సునీల్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రమోషన్ కోసమే కస్టోడియల్ టార్చర్ కేసులో భాగమయ్యారు. ఆ కేసులో సునీల్ కుమార్‌పై నేరం రుజువు కావడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఈ కేసులో ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది’ అని పేర్కొన్నారు.