AP: అల్లూరి జిల్లా అరుకులోయలో భూప్రకంపనలు వచ్చాయి. పాడేరు, హుకుంపేట, పెద్దబయలు మండలాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. భయంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఒడిశా సరిహద్దుల్లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.