AP: స్వాతంత్య్ర సమరయోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పనిచేసిన ధీరుడు.. భారత మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి జన చైతన్యం తెచ్చిన సామాజిక సంస్కర్త అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో భావితరాలు ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.