TG: సీఎం రేవంత్ ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బాసర చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.