జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఫ్లైట్లో ప్రయాణించిన ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ఈ సందర్భంగా శ్రీను స్పందిస్తూ.. ‘చిన్నప్పుడు ఆకాశంలో విమానం వెళ్తుంటే అందులో చిరంజీవి గారు ఉన్నారని అరిచేవాళ్లం, ఇప్పుడు ఆయనతోనే కలిసి ప్రయాణించడం కలగా ఉంది’ అని ఎమోషనల్ అయ్యాడు. కాగా, శ్రీను నటించిన తాజా చిత్రం ‘రాకాస’ ఏప్రిల్ 3న విడుదలైంది.