MBNR: చిన్న వడ్డేమాన్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. ప్రత్యేక పూజలు, హారతులు, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.