AP: సీఎం చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లా యాడికిలో పర్యటించనున్నారు. ‘సాగునీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొని రైతులతో సమావేశమవుతారు. హంద్రీనీవా కాలువ నీటి వినియోగం, సాగునీటి నిర్వహణపై చర్చిస్తారు. సాగునీటి సంఘాలకు 100 రోజుల ప్రణాళికపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం వేములపాడు వద్ద ‘హాఫ్ మూన్’ వ్యవసాయ విధానాన్ని పరిశీలించనున్నారు.