KRNL: అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన సందర్భంగా ఆలూరులో ‘ఇంటింటికీ దీపోత్సవం’ కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించారు. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తన నివాసంలో దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రైతుల దీర్ఘకాల పోరాటానికి లభించిన గౌరవమని ఇంఛార్జ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.