SRCL: వేములవాడ పట్టణ పరిధిలో 2011లో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడైన కొండపల్లి బుచ్చయ్యను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2011లో భార్య కొండపల్లి జమునను భర్త బుచ్చయ్య దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి శిక్ష పడినప్పటికీ, చాలా సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. ప్రజ్ఞాపూర్ ప్రాంతంలో ఇవాళ బుచ్చయ్యను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.