VKB: పేదల కోసం ఉద్దేశించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించడం చట్టరీత్యా నేరమని జిల్లా SP స్నేహా మెహ్రా సోమవారం పేర్కొన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో జూదం వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనడం ఏమాత్రం సహించరానిదన్నారు. హోదాతో సంబంధం లేకుండా చట్టవిరుద్ధ కార్య కలాపాలలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.