WNP: మున్సిపాలిటీ పరిధిలో అమృత్ 2.0 పథకంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిధిలోని మర్రికుంట పాల కేంద్రం వెనుక నిర్మిస్తున్న నీటి ట్యాంకును పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన పనులు అన్నిటిని వేగంగా పూర్తి చేయాలని సూచించారు.