ఇరాన్‌కు విధించిన గడువును మరో రెండు వారాలు పొడిగించాలని ట్రంప్‌ను పాక్ ప్రధాని షెహబాజ్ కోరారు. శాంతి కోసం ఇరాన్‌కు మరో అవకాశం ఇవ్వాలని, దౌత్యపరమైన చర్చలు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో షెహబాజ్ విజ్ఞప్తి చేశారు. దీనికి ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించాలన్నారు. హార్ముజ్ జలసంధిని 2 వారాల పాటు తెరవాలని, 14 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ప్రతిపాదించారు.