ఇరాన్లో యుద్ధంలో పెద్దఎత్తున లక్ష్యాలను సాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. కాల్పుల విరమణ అనంతరం ఆయన మాట్లాడారు. ‘గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ బలహీనపడింది. అమెరికా అధ్యక్షుడి సహకారం చాలా గొప్పది. మా వేలు ట్రిగ్గర్‌పై ఉంది. కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదు. లెబనాన్.. సంధిలో భాగం కాదు. హెజ్బొల్లాపై దాడులు కొనసాగిస్తాం’ అని వెల్లడించారు.