పాకిస్థాన్లో నెలకొన్న అస్థిర భద్రతా పరిస్థితుల దృష్ట్యా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తన ఇస్లామాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చల కోసం ఆయన పాక్ వెళ్లాల్సి ఉండగా.. భద్రతపై ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు.