TG: క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన చికిత్స అందించేందుకు ‘క్యాన్సర్ రిజిస్ట్రీ పోర్టల్’ను మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. అలాగే అత్యవసర వైద్య సేవల కోసం ‘ట్రామా కేర్ పాలసీ’ని, వైద్య సేవల్లో పారదర్శకత కోసం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఏఆర్టీ, పీసీపీఎన్డీటీ, సరోగసీ పోర్టల్‌లను ఆయన ప్రారంభించారు.