టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డిల నిశ్చితార్థం హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో ఘనంగా జరిగింది. వధువు కావ్య రెడ్డి హైదరాబాద్కు చెందిన లాయర్ కుమార్తె కాగా, వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈనెల 29న తిరుపతిలో సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది.