KMR: కేరళం అడూర్ నియోజకవర్గ పరిధిలోని పండలంలో యూడీఎఫ్ అభ్యర్థి సీ.వీ. శాంతకుమార్ మద్దతుగా ఏఐసీసీ పరిశీలకులు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యూడీఎఫ్ ప్రకటించిన ఐదు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తరహాలోనే ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.