సత్యసాయి: పుట్టపర్తిలోని గణేష్ సర్కిల్ సమీపంలోని ముస్లిం షాదీ ఖానాలో గురువారం అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధుల కోసం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మీడియా ప్రతినిధులు రక్త పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు సహా పలు వైద్య సేవలను పొందుతున్నారు. జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణ ముఖ్యమని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే సింధూర రెడ్డి తెలిపారు.