BHPL: జిల్లా కేంద్రంలోని MLA క్యాంప్ కార్యాలయంలో ఆదివారం 4, 9, 10వ వార్డులకు చెందిన 52 మంది లబ్ధిదారులకు, MLA గండ్ర సత్యనారాయణ రావు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని MLA అన్నారు.