MHBD: ఇనుగుర్తి(M)చిన్న ముప్పారం గ్రామానికి చెందిన కృష్ణమోహన్ (60)ఇవాళ మొక్కజొన్న చేనులో కూలీ పని చేస్తూ వడదెబ్బకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు ఇంటికి చేర్చి వైద్యుడిని పిలిపించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎండ తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.