SDPT: హుస్నాబాద్ మండలం గాంధీనగర్లో గురువారం జరిగిన గ్రామ సభలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బాల్యవివాహాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.