SRD: జిల్లాలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ సవరించింది. గతంలో ప్రకటించినట్లు ఈ నెల 10కి బదులుగా, 8వ తేదీ నుంచే పరీక్షలు ప్రారంభం కానున్నాయని డీఈవో వెంకటేశ్వర్లు వెల్లడించారు. సవరించిన కాలపట్టిక ప్రకారం ఈ పరీక్షలు 18వ తేదీ వరకు కొనసాగుతాయని పెర్కొన్నారు.