PLD: జాతీయ టీ-10 మహిళా క్రికెట్ టోర్నీలో ఏపీ జట్టు గెలుపొందింది. ఇందులో పల్నాడు జిల్లా కారుచోలకు చెందిన హర్షియా సుల్తానా కీలక పాత్ర పోషించింది. ఆదివారం ఆమె ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ను కలిశారు. సుల్తానాతో పాటు ఆమె తల్లిదండ్రులను ఆయన అభినందించారు. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఎంపికవ్వాలని ఆయన ఆకాంక్షించారు.