TG: దేశాన్ని డ్రగ్స్ మహమ్మారి పట్టిపీడిస్తోందని CM రేవంత్ అన్నారు. స్వాతంత్య్రం కోసం దేశానికి వీరులను ఇచ్చిన పంజాబ్‌లో ఇప్పుడు యువత డ్రగ్స్ బారిన పడటం బాధకరమని చెప్పారు. కానీ TGలో అలా జరగదని, రాష్ట్రాన్ని మరో పంజాబ్ కానివ్వబోమని స్పష్టంచేశారు. యువత సరైన దిశలో నడవకుంటే దేశానికి అపార నష్టం కలుగుతుందని, డ్రగ్స్‌ను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.