‘డెకాయిట్’ ప్రమోషన్స్‌లో అడవి శేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ చిత్రంలో నటిస్తున్న అనురాగ్ కశ్యప్‌కు షూటింగ్ సమయంలోనే టామ్ క్రూజ్ సినిమాలో లీడ్ రోల్ ఆఫర్ వచ్చిందని తెలిపాడు. కానీ ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారని శేష్ వెల్లడించాడు. కథ నచ్చితే భాషతో సంబంధం లేకుండా నటించే జెన్యూన్ పర్సన్ అని కొనియాడాడు. ఏప్రిల్ 10న ‘డెకాయిట్’ విడుదల కానుంది.