KNR: గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులను 10వ తరగతి విద్యార్థులు చితకబాదిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రిన్సిపల్ జైసింగ్‌ను సస్పెండ్ చేశారు. గెస్ట్ టీచర్ రమేష్, నైట్ వాచ్ మెన్ శంకర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు కార్యదర్శి సైదులు ఉత్తర్వులు జారీ చేశారు.