SRD: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు తెలిపారు. వైద్య శాఖ కార్యాలయంలో అవగాహన సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఐదు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు.