ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్, వామపక్షాలు తీవ్రవాద శక్తులకు కొమ్ముకాస్తున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. కేరళలోని మునంబంలో వఖ్ఫ్ బోర్డు వాదనల వల్ల 600 క్రైస్తవ, హిందూ కుటుంబాలు నిరాశ్రయులవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. బాధితులకు కాకుండా అరాచక శక్తులకు మద్దతు నిలవడం ప్రజాస్వామ్యానికి చేటని తురువల్ల ప్రచారంలో ఆయన పేర్కొన్నారు.