SRD: భారత మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సంగారెడ్డి పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ప్రభాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి, ముఖ్యంగా పేదలు, దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి చిరస్మణనీయం అని తెలిపారు.