ADB: సమ సమాజ స్థాపనకు బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి దేశానికి ఆదర్శమని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. ఉట్నూరు మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆత్రం సుగుణ పేర్కొన్నారు.