KDP: ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కడప రిమ్స్ ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పేరుకుపోయిన చెత్త, మెడికల్ వ్యర్థాలను సకాలంలో తొలగించకపోవడంపై అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాల్లో వ్యర్థాలు నిల్వ ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.