NRPT: మైనర్ బాలికను ప్రేమించి ఆమె మరణానికి కారణమైన మైనర్ బాలుని కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్ రామ్ సోమవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. నారాయణపేటలో అభం శుభం తెలియని మైనర్ బాలికను ప్రేమించి పెళ్లికి నిరాకరించి ఆమె మరణానికి కారణమైన బాలుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి దుశ్చర్యను కులమతాలకు అతీతంగా ప్రోత్సాహించదన్నారు.