TG: నీళ్లు, రైతుల సమస్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మిస్తే లిఫ్ట్‌ల అవసరం ఉండదని, గ్రావిటీతోనే నీళ్లు పారుతాయన్నారు. ఏడాది కాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి ప్రయత్నిస్తున్నా మహారాష్ట్ర CM కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. మహారాష్ట్ర CMతో సమావేశం ఏర్పాటు చేసేందుకు కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని సీఎం కోరారు.