VSP: విశాఖ నగర పోలీస్ కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు 135 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుటుంబ కలహాలు ఫిర్యాదులు ఎక్కువ వచ్చాయన్నారు.